
కేటీఆర్‌కు రాఖీ కట్టింది లగచర్ల ఆడబిడ్డ జ్యోతి, గిరిజన మహిళలు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ నివాసానికి వచ్చారు లగచర్ల గిరిజన మహిళలు. కేటీఆర్ కు రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన లగచర్ల మహిళలను ఆశీర్వదించారు కేటీఆర్.
తన భర్తను ప్రభుత్వం అక్రమంగా జైలుకు పంపినప్పుడు కేటీఆర్ అన్న లెక్క నిలబడ్డాడని జ్యోతి చెప్పారు. గర్భిణిగా ఉన్నప్పుడు తన క్షేమాలన్నీ చూసుకొని, నా బిడ్డకు మేనమామ లెక్క భూమి నాయక్ అని పేరు పెట్టాడని చెప్పారు. ఆపదలో నాకు దేవుడు ఇచ్చిన అన్న కేటీఆర్ అని రాఖీ కట్టిన లగచర్ల ఆడబిడ్డ జ్యోతి తెలిపారు.