తెలంగాణ

సామాజిక తెలంగాణ దిశగా కవిత స్కెచ్.. బొల్ల శివశంకర్ కు కీలక పదవి

సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచింది.తనతో పాటు బీసీ ఉద్యమంలో పోరాడుతున్న బొల్ల శివశంకర్ కు కీలక పదవి కట్టబెట్టింది. యునైటెడ్ పూలే ఫ్రంట్( UPF) కన్వీనర్ గా శివశంకర్ ను నియమించింది. బంజారాహిల్స్ లో కొత్త కార్యాలయం ప్రారంభించిన మరుసటి రోజే బొల్ల శివశంకర్ కు కీలక పదవి అప్పగించింది ఎమ్మెల్సీ కవిత

కవిత డైరెక్షన్ లో సాగుతున్న సామాజిక తెలంగాణ ఉద్యమంలో శివశంకర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత 15 నెలలుగా కవిత నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. 2025 జనవరిలో యూపీఎఫ్ ను ఏర్పాటు చేసింది కవిత. అప్పటి నుంచి యూపీఎఫ్ కార్యక్రమాలను విజయవంతంగా జరుపుతున్నారు బొల్ల శివశంకర్. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటుకు కవిత కలిసి ఉద్యమించారు. కవిత పోరాటంతోనే పూలే విగ్రహాం ఏర్పాటుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది.

బీసీ ఉద్యమానికి స్పూర్తిగా నిలిచే సావిత్రిభాయ్ పూలే జయంతిని టీచర్స్ డే ప్రభుత్వం నిర్వహిస్తుందంటే అందుకే యూపీఎఫ్ పోరాటమే కారణం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బొల్ల శివశంకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. స్థానిక సంస్థలతో పాటు విద్యా,ఉద్యోగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని.. అందుకోసం రెండు వేరువేరు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇందిరాపార్క్ దగ్గర ఆందోళన చేశారు. ఈ కార్యక్రమాన్ని యూపీఎఫ్ ఆధ్వర్యంలో గ్రాండ్ సక్సెస్ చేశారు బొల్ల శివశంకర్. కవిత, యూపీఎఫ్ ఆందోళనలతోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో రెండు వేరువేరు బిల్లులను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.

సామాజిక తెలంగాణ సాధనలో భాగంగా పలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించింది ఎమ్మెల్సీ కవిత. బీసీ సమావేశాల నిర్వహణలో అంతా తానే నడిపించారు బొల్ల శివశంకర్. గత ఏడాదిన్నరగా తనతో పాటు శ్రమిస్తున్న శివశంకర్ సేవలను గుర్తించి.. ఆయనను యూనైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గా నియమించింది కవిత. తనకు కీలక పదవి కట్టబెట్టిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు బొల్ల శివశంకర్. కవితక్క సారథ్యంలో సామాజిక తెలంగాణ కోసం మరింతగా శ్రమిస్తానని చెప్పారు. తనపై కవితక్క పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.తనకు ఇప్పటివరకు సహకరించిన బీసీ సంఘాలు, జాగృతి సంఘాల నేతలకు బొల్ల శివశంకర్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button