ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

సాయంత్రం 4గంటల వరకే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం – ఈనెల 27న పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెర పడుతుంది. ఈనెల 27న పోలింగ్‌ జరగనుండగా… వచ్చే నెల 3వ తేదీన ఓట్లు లెక్కిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్‌, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుండగా… తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్‌ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే… ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. ఇవాళ (మంగళవారం) సాయంత్రం 4గంటలకు ప్రచారానికి తెరపడుతుంది. తెలంగాణలో ప్రధాన పార్టీలు పోటాపోటీ ప్రచారాలు నిర్వహించారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా …. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తెలంగాణలో… ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ టీచర్‌ ఎమ్మెల్సీ… మెదక్‌-కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక… మెదక్‌-కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది… మెదక్‌-కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్‌, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుండగా… ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. వామపక్ష పార్టీల్లో సీపీఐ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయించడం లేదు. సీపీఎం మాత్రమే అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక.. .. గుంటూరు-కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ బరిలో ఉన్నారు. ఆయన గెలుపు దాదాపు లాంఛనమే. అలాగే… ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీకి… కూటమి అభ్యర్థిగా APTF నేత పాకలపాటి రఘువర్మ బరిలో ఉండగా… PRTU తరపున మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్యనే పోటీ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button