
చండూరు, క్రైమ్ మిర్రర్:-తప్పు చేస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం చండూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అయినా సరే అవతల పార్టీ అయినా సరే ఎవ్వర్నీ వదిలిపెట్టనంటూ తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లేదా ఇతర ఏ విషయాల్లో నైనా వసుళ్ళకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఇప్పటికే వసూళ్లకు పాల్పడిన వారిపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు ఆదేశించినట్లు తెలిపారు. బాధితులు ఎవరు ముందుకు వచ్చిన వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నకిలీ మద్యం వ్యవహారం పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు దుకాణాలు నడిపించే వారి పైన ఉక్కుపాదం తప్పదు అన్నారు.
కందుకూరులో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ సమన్వయ సమావేశం
పేద ప్రజల పక్షాన ఉంటూ వారికి న్యాయం జరిగేలా చూడాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుపక్షం విపక్షం అంటూ తేడా లేకుండా అక్రమాలకు పాల్పడే వారిపైన గట్టి వార్నింగ్ లు ఇస్తుండడంతో స్థానికంగా సర్వత్ర చర్చ జరుగుతుంది. నాయకుల మోసాలకు బలైన వారు ఎవరైనా ఉంటే నేరుగా ఎమ్మెల్యే గారికే ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయనే స్వయంగా తన మనసులతో విచారణ చేయిస్తూ న్యాయ అన్యాయాలను లెక్క తేలుస్తున్నారు. అవసరమైతే నిందితుల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశిస్తున్నారు. చూడాలి ఇంకా ఎంతమంది బాధితులు ఆయనకు నేరుగా ఫోన్ చేసి తమ గోడును వెళ్లి బుచ్చుతారో. ఏ నాయకుల పేర్లు బయటికి వస్తాయో.