క్రైమ్

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దౌర్జన్యం.. వందమందితో వెళ్లి ల్యాండ్ కబ్జా!

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన అనుచరులతో వెళ్లి ల్యాండ్ కబ్జా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తన భూమిలోకి ఎమ్మెల్యే తన మనుషులతో చొరబడి.. అక్రమంగా తన ల్యాండ్ ను కబ్జా చేశారని నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ప్రధాన అనుచరుడు అశోక్ ఆరోపించారు. ఎమ్మెల్యే సోదరుడు, అతని అనుచరులు చేసిన విధ్వంసానికి సంబంధించి సీసీ పుటేజ్ ను విడుదల చేశారు.

కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరుడు అశోక్ చెప్పిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు డిఫెన్స్ కాలనీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులు దౌర్జన్యం చేశారు. సర్వే నంబర్ 202,203,209 లో 1 ఎక్కర 1 గుంటలో అక్రమంగా ప్రవేశించి బ్లూ షీట్స్ తొలగించారు ఎమ్మెల్యే అనుచరులు. ఎమ్మెల్యే తో పాటు 100 మంది సైట్ లోకి ప్రవేశించి సీసీటీవీ కెమెరాలు, వాచ్ మెన్ పై దాడి చేశారు.షేడ్స్, గడ్డి తలగబెట్టి వీరంగం చేశారు. కాట శ్రీనివాస్ వర్గంలో ఉన్నాననే కారణంతోనే తన భూమిపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కన్నేశాడని అశోక్ ఆరోపిస్తున్నారు.

కొన్ని రోజులుగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వార్ సాగుతోంది. రెండు రోజుల క్రితమే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాట వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మహిపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై దాడి చేశారు. మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. మరోవైపు కాట వర్గీయుల దాడిపై స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. కాట శ్రీనివాస్ కు వార్నింగ్ ఇచ్చారు. తన జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం కాంగ్రెస్ పార్టీలో రచ్చగా మారింది. కాట అనుచురుడు కాబట్టే అశోక్ ల్యాండ్ లో ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారనే టాక్ వస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button