
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోదరుడు బీర్ల శంకర్.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం రచ్చగా మారుతోంది. ఈవో తీరుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈవో ప్రోటాకాల్ పాటింకుండా పూర్తి స్ధాయిలో నిర్లక్ష్యం చేశారని..నల్లగొండ మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోదరుడు బీర్ల శంకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఎలా తెస్తారని ప్రశ్నించారు.
వార్డు మెంబర్ కాని వ్యక్తి పట్టు వస్త్రాలు ఎలా తెస్తారని మండిపడ్డారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ పదవల్లో ఉన్నవాకే అవకాశం కల్పించాలన్నారు. ఈవో పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత లేని వ్యక్తులు ప్రభుత్వ లాంచానాలతో ఏ విధంగా తీసుకువస్తారో సమాధానం చెప్పాలని ఈవో ను ప్రశ్నించారు. వివాదంపై స్పందించిన ఆలయ ఈవో భాస్కర్‌రావు ఎక్కడా ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని తెలిపారు.