
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆలేరు నియోజకవర్గం,ఆత్మకూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య విస్తృత పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా సర్వేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను ప్రారంభించి గ్రామాన్ని వెలుగుల్లో ముంచారు. అలాగే గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం మహిళల సాధికారతకు తోడ్పడేలా మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళలు స్వయం ఆధారంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.తదుపరి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బీర్ల అయిలయ్య తెలిపారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read also : Tech Employee Arrested: బెంగళూరు ఐటీ కంపెనీలో బడా మోసం, రూ.87 కోట్ల విలువైన డేటా కొట్టేసిన ఎంప్లాయీ!
Read also : Supreme Court: బ్రాహ్మణులకు రాజకీయ రిజర్వేషన్లు, సుప్రీం కీలక వ్యాఖ్యలు!





