తెలంగాణరాజకీయం

ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యకండి...అభివృద్ధి పై దృష్టి సారించండి

*గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు*

*సర్పంచ్ ల అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెల్లడి*

 

*క్రైమ్ మిర్రర్,  వేములపల్లి ప్రతినిది:* నూతన సర్పంచ్లు, నూతన వార్డు సబ్యులుగా ఎన్నికైన వారు  గ్రామ అభివృద్ధి పై దృష్టి సారించాలని, గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు..

*గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యకండి...అభివృద్ధి పై దృష్టి సారించండి*
*గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యకండి…అభివృద్ధి పై దృష్టి సారించండి*

గురువారం మిర్యాలగూడ పట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములపల్లి మండలం పరిధిలోని లక్ష్మీదేవి గూడెం గ్రామపంచాయతీ నూతన సర్పంచిగా ఎన్నికైన ఎలుకట్టి భరత్ కు  అలాగే ఆమనగల్లు గ్రామపంచాయతీ నూతన సర్పంచిగా ఎన్నికైన పిల్లల సందీప్ లకు అలాగే వార్డు సబ్యులుకు  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సర్పంచ్లకు, నూతన వార్డు సబ్యులకు  పుష్పగుచ్చం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ ప్రజలు మీపై ఎంతో నమ్మకంతో అధిక మెజార్టీ ఇచ్చి మిమ్ములను సర్పంచులు గా గెల్చుకున్నందుకు గాను మీరు గ్రామ అభివృద్ధి పై దృష్టి సారించి వారి నమ్మకాన్ని మరింత పెరిగే విధంగా అభివృద్ధి కార్యచరణలపై దృష్టి సాధించాలని కోరారు..
*గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యకండి...అభివృద్ధి పై దృష్టి సారించండి*
*గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యకండి…అభివృద్ధి పై దృష్టి సారించండి*
గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు.. ఈ అవకాశాన్ని ఎంతో అదృష్టంగా భావించి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని,ఎలాంటి వివక్ష చూపకుండా పని చెయ్యాలని ఆయన  నూతన  సర్పంచ్లకు సూచించారు..
సర్పంచ్ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బి.ఎల్.ఆర్ బ్రదర్స్, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button