జాతీయంవైరల్

Missed Call Messages: వాట్సాప్‌లో మరో 2 కొత్త ఫీచర్లు

Missed Call Messages: వాట్సాప్ తన వినియోగదారులకు మరోసారి పండగ కానుక అందించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి అత్యంత చేరువైన ఈ మెసేజింగ్ యాప్..

Missed Call Messages: వాట్సాప్ తన వినియోగదారులకు మరోసారి పండగ కానుక అందించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి అత్యంత చేరువైన ఈ మెసేజింగ్ యాప్.. కమ్యూనికేషన్‌ను ఇంకా వేగవంతం చేయాలని, ఇంకా సులభంగా మార్చాలని కొత్త ఫీచర్లతో ముందుకొచ్చింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసిన ఈ తాజా అప్‌డేట్లు కాల్స్‌ నుంచి చాట్స్‌ వరకు, స్టేటస్‌ నుంచి మెటా AI ఫీచర్ల వరకు అన్ని విభాగాల్లో పెద్ద మార్పులకే నాంది పలుకుతున్నాయి. మిస్డ్ కాల్ మెసేజెస్, మెటా AI ఇమేజ్ యానిమేషన్, క్లీనర్ లింక్ ప్రివ్యూలు, డెస్క్‌టాప్ కోసం ప్రత్యేక మీడియా ట్యాబ్ వంటి ఫీచర్లు వినియోగదారుల అనుభవాన్ని పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి.

వాయిస్ కాల్‌లో స్పందన ఇవ్వాలంటే తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితిని తొలగిస్తూ, ఇప్పుడు వాయిస్ చాట్ సమయంలో రియాక్షన్‌తోనే భావాలను తెలియజేసే వీలొచ్చింది. గ్రూప్ కాల్స్‌లో ఎవరు మాట్లాడుతున్నారో వారికి ఆటోమేటిక్ స్పాట్‌లైట్ వెళ్లేలా ‘స్పీకర్ స్పాట్‌లైట్’ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది ముఖ్యంగా ఆన్‌లైన్ మీటింగ్స్, గ్రూప్ డిస్కషన్స్‌లో ఎంతో ఉపయోగపడుతుంది.

మిస్డ్ కాల్ మెసేజెస్ మరొక ఆసక్తికర ఫీచర్. ఎవరో మీ కాల్ తీసుకోలేకపోతే, వెంటనే మీరు వాయిస్ నోట్ లేదా వీడియో నోట్ రికార్డ్ చేసి పంపించొచ్చు. ఇంతకు ముందు వాయిస్‌మెయిల్‌ లాగా ఉండే పాత విధానం ఇకనుండి వాట్సాప్‌లో అవసరం లేకుండా పోతోంది. ఒక క్లిక్‌తో భావోద్వేగాలు, సమాచారాన్ని పంపే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.

చాట్స్ విభాగంలో మెటా AI చేసిన అప్‌గ్రేడ్‌లు అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. ఫ్లక్స్, మిడ్‌జర్నీ ఆధారిత కొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్స్‌తో ఇప్పుడు వినియోగదారులు కొత్త తరహా చిత్రాలు సృష్టించుకోవచ్చు. పండగల శుభాకాంక్షలు, ప్రత్యేక సందేశాలు, సృజనాత్మక డిజైన్లు ఇవన్నీ చాలా సహజంగా, స్పష్టంగా రూపొందుతాయి. అంతేకాదు, స్టాటిక్ ఫోటోలను చిన్న వీడియోలా యానిమేట్ చేసే కొత్త ఫీచర్ మెటా AI ద్వారా అందుతోంది. ప్రతి ఒక్క స్టిల్ ఫోటో కూడా ఇప్పుడు లైవ్ యానిమేషన్‌గా మారిపోతుంది.

డెస్క్‌టాప్ వాట్సాప్ యూజర్లకు ప్రత్యేకమైన మీడియా ట్యాబ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. చాట్‌లలోని డాక్యుమెంట్‌లు, లింకులు, వీడియోలు, ఇమేజ్‌లు అన్నీ ఒకే చోట సక్రమంగా వర్గీకరించబడతాయి. దీంతో Mac, Windows, Web యూజర్లకు ఫైళ్లను శోధించడం చాలా వేగంగా మారుతుంది.

లింక్ ప్రివ్యూల రూపకల్పనను కూడా మార్చినట్లు వాట్సాప్ తెలిపింది. చాట్ మధ్యలో పొడవైన URLs వల్ల సంభాషణని అంతరాయం కలగకుండా, ఇప్పుడు చిన్న, క్లీన్, స్పష్టమైన ప్రివ్యూలే కనిపిస్తాయి.

స్టేటస్ విభాగం కూడా మరోసారి అప్‌గ్రేడ్ అయింది. ఇంటరాక్టివ్ స్టిక్కర్లు, మ్యూజిక్ లిరిక్ యానిమేషన్స్, స్పందించగల ప్రశ్నలు వంటి ఫీచర్లు స్టేటస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి. ఛానెల్స్ నిర్వహించే అడ్మిన్‌లకు ప్రత్యేకంగా ‘క్వశ్చన్స్ ఆన్ ఛానల్స్’ ఫీచర్ తెచ్చింది. దీనివల్ల ప్రేక్షకుల స్పందనలు, అభిప్రాయాలు రియల్ టైమ్‌లో అందుబాటులోకి వస్తాయి. వాట్సాప్ విడుదల చేసిన ఈ కొత్త అప్‌డేట్లు పండగ సీజన్‌కు ముందే వినియోగదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కమ్యూనికేషన్‌ను మరింత వేగంగా, సృజనాత్మకంగా మార్చే ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నవే.

ALSO READ: తిరుమల భక్తులకు పండగే పండగ.. ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button