సినిమా

కుర్రకారు మతి పోగొడుతున్న మిరాయ్ హీరోయిన్ రితిక!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు తమ సత్తా చాటుకుని ఈరోజు చాలా సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో వరుస ప్లాప్ లతో సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు. మరి కొంతమంది హీరోయిన్లు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రమే ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోతారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమల లోకి అడుగు పెడుతూ వాళ్లకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది హీరోయిన్లు కుర్ర కారు డ్రీమ్ గర్ల్స్ ల మిగిలిపోతూ ఉంటారు. ఇక నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీ లీల వరుసగా సినిమాలు చేస్తూ.. తన నటనతో, డ్యాన్సులతో, తన అందంతో ప్రతి ఒక్కరిని చాలా బాగా ఆకట్టుకుంది.

Read also : పహల్గాం ఎఫెక్ట్.. IND vs PAK మ్యాచ్ కు కరువైన ఆసక్తి!

అయితే కొద్ది రోజుల నుంచి హీరోయిన్ రితికా నాయక్ తెలుగు కుర్రాళ్ళ మనసులను దోచేస్తుంది. మిరాయ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రితిక నాయక్ యువకుల న్యూ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలే కానీ.. తన నటన, తన అందం, తన అమాయకత్వం, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అలాగే పెర్ఫార్మెన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల లో చాలా క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వక్సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం, నాని నటించిన హాయ్ నాన్న సినిమాల్లో ఈ హీరోయిన్ నటించింది. ఈమె ఢిల్లీ ఒడియా కుటుంబానికి చెందిన అమ్మాయి. అయితే గతంలో ఈ హీరోయిన్ రితికా నాయక్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించడమే తన డ్రీమ్ అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి తన డ్రీమ్ నెరవేరుతుందో లేదో అనేది భవిష్యత్తులో చూడాల్సిందే.

Read also : అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ 3వ మహాసభలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button