తెలంగాణ

రైతు భరోసాపై గందరగోళం.. మంత్రుల్లో విభేదాలు!

క్రైమ్ మిర్రర్ : రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు మళ్లీ నిరాశే ఎదురైంది. రేపుమాపు అంటూ ఏడాదిగా నెట్టుకొస్తున్న రేవంత్ సర్కార్… సంక్రాంతికి ఖచ్చితంగా రైతు భరోసా అందిస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఎకరాకు ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు. అయితే గతంలో మాదిరి అందరికి కాకుండా కొందరికి కట్ చేస్తామని తెలిపారు. జనవరిలో రైతు భరోసా కింద ఎకరాకు 7 వేల 5 వందల రూపాయలు ఇస్తామన్నారు. సీఎం ప్రకటించి రోజులు కావస్తున్నా రైతుభరోసా మార్గదర్సకాలు విడుదల కాలేదు. కటాఫ్ ఎంతవరకు పెడతారన్నది తేలలేదు. 7 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తామని కొందరు మంత్రులు.. కాదు కాదు 10 ఎకరాలక వరకు ఇస్తామని ఇంకొందరు మంత్రులు చెబుతున్నారు.

Also Read : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన

ఐటీ కట్టేవాళ్లు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు రైతు భరోసా ఇచ్చేదిలేదని చెబుతున్నారు. అయితే రైతు భరోసా మార్గదర్శకాలపై ప్రభుత్వం అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. రైతు భరోసాపై నియమించిన మంత్రివర్గ ఉప సంఘం కూడా ఏమి తేల్చడం లేదు. ఆదివారం జరిగిన కేబినెట్ సభ్ కమిటీ సమావేశంలోనూ రైతు భరోసాపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు సాగిన భేటీలో రైతు భరోసా మార్గదర్శకాలపై మంత్రుల మధ్య కుదరని ఏకాభిప్రాయం. దీంతో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రైతు భరోసా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ప్రభుత్వం చెబుతున్నట్లు సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు అన్నదాతల అకౌంట్లలో జమ చేయడం కష్టమేననే టాక్ వస్తోంది.

ఇవి కూడా చదవండి : 

  1. మద్యం ప్రియులకు పండగే.. పండగ… వైన్స్‌ షాపులు, బార్‌ల సమయ వేళలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
  2. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత
  3. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ రెగ్యలర్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా
  4. పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి
  5. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button