
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్
అత్యవసర ల్యాండింగ్ అయింది. సూర్యాపేట జిల్లా కోదాడలో అత్యవసర ల్యాండ్ అయిన మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ . హుజూర్ నగర్ మండలం మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సిన హెలికాఫ్టర్.. వాతావరణం సహకరించకపోవడంతో కోదాడలో ల్యాండైంది.
వాతావరణ శాఖ సూచన మేరకు అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలెట్. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపధ్యంలో అప్రమత్త హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్. హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ మండలం మేళ్లచెరువుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ లో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ అత్యవసరంగా సేఫ్ గా ల్యాండ్ కావడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు, అభిమానులు కాంగ్రెస్ నేతలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ కావడంతో కోదాడ నుంచి హుజూర్ నగర్ వరకు 16 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాతావరణం సరిగా లేకున్నా హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ లో ఎందుకు రావాల్సి వచ్చిందని జనాలు ప్రశ్నించుకుంటున్నారు. అసలు హైదరాబాద్ నుంచి హజూర్ నగర్ కు హెలికాప్టర్ వాడాల్సిన అవసరం ఏంటని చర్చించుకుంటున్నారు.