
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయవచ్చని మంత్రి స్పష్టం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి వంటి ఎన్నికలకు కేవలం ఇద్దరు పిల్లలు నిబంధన మాత్రమే ఉండేదని.. వీళ్ళకి అంతకుమించి ఎక్కువమంది పిల్లలు ఉంటే ఎన్నికలకు పోటీ చేసే అర్హత ఉండేది కాదని తెలిపారు. తాజాగా ఆ చట్టాన్ని మార్చాలని క్యాబినెట్ నిర్ణయించింది అని పేర్కొన్నారు. ఈ క్యాబినెట్ నిర్ణయం ద్వారా వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ అలాగే జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని కోరారు. ఎక్కువమంది పిల్లలు ఉన్న కారణంగా ప్రజలకు సేవ చేయాలనే వారు కూడా వెనకడుగు వేయాల్సి వస్తుంది… అందుకే ఈ చట్టాన్ని మారుస్తూ నేడు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు.
Read also : వ్యవసాయం పై విద్యార్థులు కు అవగాహన కార్యక్రమం
Read also : బీసీ రిజర్వేషన్లపై TPCC చీఫ్ మహేష్ కుమార్ కీలక ప్రకటన