
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- రాష్ట్రంలోని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా తన కుటుంబ సభ్యులు లాంటి వారిని చెప్పుకొచ్చారు. కాబట్టి వీరికి ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకోవడం తన బాధ్యత అంటూ మంత్రి నారా లోకేష్ తన మనస్తత్వాన్ని చాటుకున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో మాచర్లలో జరిగినటువంటి ఒక సంఘటన ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిన్నెల రామకృష్ణారెడ్డి అలాగే అనుచరుల దాడిలో గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త శేషగిరిరావు ఇటీవల అస్వస్థత కారణంగా మరణించారు. శేషగిరిరావు కుటుంబ సభ్యులను తాజాగా మంత్రి నారా లోకేష్ ఉండవల్లి లోని తన నివాసం వద్దకు పిలిపించి మరీ మాట్లాడారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో శేషగిరిరావు చాలా గట్టిగా పోరాడారని… చాలా మందికి మీ భర్త స్ఫూర్తిగా నిలిచారు అంటూ ఆ కుటుంబ సభ్యుల ముందు శేషగిరిరావును ప్రశంసిస్తూ మంత్రి లోకేష్ ధైర్యాన్ని నింపారు. ఇలాగే ప్రతి ఒక్క కార్యకర్త గురించి మా పార్టీ ఆలోచిస్తుంది అని… ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నాతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా అండగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
Read also : మా పిల్లల భవిష్యత్తును కాపాడండి..! తల్లిదండ్రులు ధర్నా
Read also : ‘మహాలక్ష్మి’ ఆర్టీసీపై భారం.. చార్జీల పెంపు పేదలపై భారం..!