
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మంత్రి నారా లోకేష్ రేపు బీహార్ లో పర్యటించనున్నారు. బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ తరఫున లోకేష్ రెండు రోజులపాటు ప్రచారం నిర్వహిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కళ్యాణదుర్గం పర్యటన ముగించుకుని మధ్యాహ్నం నుంచి నారా లోకేష్ పాట్నా వెళ్ళనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం బీహార్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమై పలు విషయాలను చర్చించనున్నారు. తెలుగు ప్రజలు బీహార్ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఎక్కువగా ఉంటారో అక్కడే మంత్రి నారా లోకేష్ ఎన్డీఏకు సపోర్ట్ గా ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాగా రేపు ఉదయం సమయంలో బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి కీలక నేతలతో పాటు మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. ప్రచారంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అభివృద్ధి ఎలా దూసుకుపోతుందో.. అదేవిధంగా బీహార్ లో ఎన్డీఏ అధికారం చేపడితే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని వివరించనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికలలో భాగంగా పలువురు కీలక నాయకులు ప్రచారాలు చేస్తూ పోతున్నారు. ఇందులో భాగంగా నారా లోకేష్ కూడా ప్రచారం చేయనున్నారు కాబట్టి.. బీహార్ రాష్ట్ర వేదికగా నారా లోకేష్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారా?.. అని ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also : నిరాశపరిచిన రాజమౌళి అప్డేట్.. కాపీ అంటూ తిప్పికొట్టిన నెటిజెన్లు?
Read also : అమ్మో చలి వచ్చేసిందోచ్.. ఇక జాగ్రత్తగా ఉండండి!





