
తెలంగాణ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలిసి యూపీలోని ప్రయాగ్ రాజ్ వెళ్లారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సోమవారం ఉదయం గం. 5.10 నిమిషాలకు ప్రయాగరాజ్ లోని సంగం ఘాట్ లో పున్యస్నానం ఆచరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్ లో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంత్రికి వేదాశ్వీర్వచనం ఇచ్చారు వేదపండితులు. అనంతరం శ్రీ బడే హనుమాన్ జీ దేవాలయాన్ని సందర్శించి హనుమంతుడికి మొక్కులు సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు పూజారులు.