ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కష్టాల్లో పడ్డారు.ఆయన ఎంపీ పదవికి ఎసరొచ్చింది. పార్లమెంట్ లో ఆయన చేసిన కామెంట్లపై కోర్టు సీరియస్ అయింది. ఈ విషయంలో అసదుద్దీన్ ఒవైసీకి బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జై పాలస్తీనా అని నినదించారు అసదుద్దీన్ ఒవైసీ.
జై పాలస్తీనా అని అనడంపై న్యాయవాది వీరేంద్ర గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తప్పు పడుతూ యూపీలోని బరేలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జనవరి 7న తమ ముందు హాజరు కావాలని అసదుద్దీన్ ఒవైసీని ఆదేశించింది రాయబరేలీ హైకోర్టు.