Monday, March 16, 2026
Homeజాతీయంఇండియాలో "మైగ్రేన్" విధ్వంసం.. హెచ్చరిస్తున్న వైద్యులు?

ఇండియాలో “మైగ్రేన్” విధ్వంసం.. హెచ్చరిస్తున్న వైద్యులు?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది జనంలో కొన్ని లక్షల మంది మైగ్రేన్ అనే తలనొప్పి సమస్యతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు పనిచేసేటువంటి వ్యక్తులు, యువకులకు ఇటువంటి మైగ్రేన్ సమస్యతో బాధపడుతూ వైద్యులను సంప్రదిస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే తాజాగా వైద్యులు పేర్కొన్న అధ్యయనంలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైగ్రేన్ అనేది ఒక సాధారణ తలనొప్పి కాదు అంటూ ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని తెలిపారు.

ప్రస్తుతం మన భారతదేశంలో ప్రతి నలుగురులో ఒకరికి ఈ మైగ్రేన్ సమస్య ఉంది అని వెల్లడించారు. ఈ మైగ్రేన్ ఉన్నవారికి తీవ్రమైన తలనొప్పి తో పాటుగా వాంతులు అలాగే వెలుతురుని కూడా సరిగా చూడలేరు అని వైద్యులు తెలిపారు. ఈ మైగ్రేన్ అనే సమస్య తీవ్రమైన ఒత్తిడి, సరిగా నిద్రపోకపోవడం, అలాగే కొన్ని ఆహారపు అలవాట్లు వల్ల వస్తుంది అని వైద్యులు పేర్కొన్నారు. కాబట్టి జీవనశైలిలో భాగంగా కొన్ని మార్పులు చేసుకుంటూ మరోవైపు వైద్యుల సూచనలు పాటిస్తూ సరైన చికిత్స అందిస్తూ ముందుకు వెళితేనే ఈ మైగ్రేన్ సమస్యను తగ్గించుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మైగ్రేన్ సమస్య ఉన్నవారు కచ్చితంగా అప్రమత్తంగా ఉంటూ నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను కలవాలని సూచిస్తున్నారు.

చాలా దారుణ స్థితిలో మా టీం ఉంది : మాజీ క్రికెటర్

Free Flight Ticket Misuse: ఫ్రీ టిక్కెట్లు అమ్ముకున్న ఉద్యోగులు, 4 వేల మందిపై ఎయిర్ ఇండియా చర్యలు?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments