
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకోడుతూనే ఉన్నాయి. గత ఆగస్టు నెల నుంచి నేటి రోజు వరకు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే నానా రకాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచి కొట్టాయి. అయితే ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఈరోజు కూడా ఉండనుందని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఈ 11 జిల్లాలు అలర్ట్ :-
1. అదిలాబాద్
2. అసిఫాబాద్
3. నిర్మల్
4. నిజామాబాద్
5. కరీంనగర్
6. పెద్దపల్లి
7. భూపాలపల్లి
8. ములుగు జిల్లా
9. మహబూబాబాద్
10. మెదక్
11. ములుగు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 11 జిల్లాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు. ఈరోజు ఈ 11 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పొలాలకు వెళ్లే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని… సెలవల కారణంగా ఇంటి దగ్గరే ఉండే పిల్లలు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. కరెంట్ స్తంభాలు, లోతట్టు ప్రాంతాల వైపు ఎవరు కూడా వెళ్లకూడదని హెచ్చరించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే… అత్యవసర కాల్ నెంబర్స్ కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. ఈ అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కావున ఈ సందర్భంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని… అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని కోరారు.
Read also : విజయ్ ఇంటి వద్ద భారీ సెక్యూరిటీ… ఏ క్షణం ఏం జరుగుతుందో?
Read also : నేడే IND vs PAK మ్యాచ్… ఇప్పటికీ కూడా ఎందుకు?