వైరల్సినిమా

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ AI వీడియో.. అభిమానుల రియాక్షన్ ఇదే?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ఈ మధ్యకాలంలో ఏఐ ఎంతగా విస్తరించిపోయిందో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది ఏఐ ఉపయోగించుకొని కొందరి మనసులను దోచుకుంటుంటే మరికొందరు మాత్రము ఏఐ ను చెడు మార్గాలకు ఉపయోగిస్తున్నారు. ఒకవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్ల ఫోటోలు ఏఐ తో అసభ్యకరంగా ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ అయ్యేలా చేస్తుండగా మరోవైపు మెగా ఫ్యామిలీకి చెందిన ఒక ఏఐ వీడియో మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది. ఆ ఏఐ వీడియోలో మెగా ఫ్యామిలీకి చెందినటువంటి మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు మరియు పవన్ కళ్యాణ్ వీరందరూ తమ తండ్రితో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలను ఏఐ సాయంతో రూపొందించి ఉంది.

Read also : Crime Mirror Telangana Latest Updates 18-12-25: ముఖ్యమైన వార్తలు

ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే మొదటగా ఈ వీడియోను హీరో సాయి దుర్గా తేజ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా చాలామంది అభిమానులు ఇది హార్ట్ టచింగ్ గా ఉంది అంటూ.. ఇది కదా సూపర్ టెక్నాలజీ అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఏఐ సహాయంతో ఇలాంటి మనసును దోచుకునే వీడియోలు చేయాలి కానీ.. అసభ్యకరంగా దేన్నీ కూడా ఉపయోగించుకోకండి అని తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఏ ఈ సహాయంతో ఇటువంటి ఆనందపరిచేటువంటి వీడియోలు క్రియేట్ చేయండి అని క్రియేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read also : Social Media: సోషల్ మీడియాలో పరిచయమైన అబ్బాయి కోసం ఇల్లు వదిలేసిన అమ్మాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button