క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:-ప్రస్తుతం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అప్పటివరకు సంపాదించుకున్న డబ్బు మొత్తాన్ని కూడా చివరికి ఆసుపత్రులకే విచ్చించాల్సి వస్తుంది. ఇటువంటి తరుణంలో అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రజలను పరిశీలించి అనంతరం డాక్టర్లు వారికి తగ్గట్లుగా వైద్యాన్ని సూచిస్తున్నారు. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే డాక్టర్లు మందుల చీటీ రాసి పంపిస్తూ ఉంటారు. అయితే ఇదే సందర్భంలో ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గమనించి ఉంటారు. డాక్టర్లు రాసే మందులు చీటీ మెడికల్ షాపు వాళ్లకు తప్పించి మిగతా ఎవరికి కూడా అర్థం కాదు. కోడి గెలికినట్టు రాస్తున్నారు అని గ్రామాల్లో ఉండే వారైతే ప్రతిరోజూ తిట్టుకునే సందర్భాలు కూడా చూస్తూనే ఉంటాం. ఈ విషయంపై చాలాసార్లు వాదనలు కూడా వినిపించే ఉంటారు.
Read also : శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు.. రికార్డు స్థాయిలో దర్శనాలు?
ఇక తాజాగా దీనికి చెక్ పెట్టే విధంగా నేషనల్ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఒక్క డాక్టర్ కూడా మందులు చీటీ రాసే క్రమంలో ప్రతి లెటర్ కూడా అర్థమయ్యే విధంగా రాసి ఇవ్వాలి అని.. అది చదువుకున్న వ్యక్తి ఎవరైనా సరే స్పష్టంగా చదవగలగాలి అని స్పష్టం చేసింది. ఈ విషయం కచ్చితంగా అమలయ్యేలా ప్రత్యేక కమిటీలు వేయాలని మెడికల్ కాలేజీ లను నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించింది. ప్రతి ఒక్కరికి ప్రెస్క్రిప్షన్ అనేది అర్థమయ్యేలా రాసి ఇవ్వాలని అలా రాసి ఇవ్వని పక్షంలో అది చట్ట విరుద్ధంగా పేర్కొనబడుతుంది అని నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులు వెల్లడించారు. కాబట్టి డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి సరైన పద్ధతిలో ముందుకు వెళ్లాలి అని విజ్ఞప్తి చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలామంది సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read also : బాలయ్య మజాకా.. మరో పాటకు సిద్ధమైన బాలకృష్ణ?





