
కీసర, క్రైమ్ మిర్రర్:- కీసరలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఒక సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకకాలంలో అన్ని మెడికల్ షాపులు మూతపడటంతో ప్రజలు విస్తుపోయారు. మొదట ఇది ఏదైనా సమ్మె అనుకుని పట్టించుకోలేదు. కానీ అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఆ ప్రాంతంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహిస్తున్నాడని సమాచారం రావడంతో, పలువురు మెడికల్ షాపులు తక్షణమే షట్టర్లు డౌన్ చేశారు. ఈ పరిస్థితిని చూసిన స్థానికులు, “నిబంధనలు పాటిస్తున్న షాపులు లేవా?” అని ప్రశ్నిస్తున్నారు.
తుళ్లూరులో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు.. “దుష్ప్రచారం చేస్తే తలలు తీసేయాలి”
ఔషధాల నాణ్యత, లైసెన్స్, సరైన అనుమతులు, నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు జరుగుతున్నాయా.! అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, మెడికల్ షాపులపై క్రమం తప్పకుండా విస్తృత తనిఖీలు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.డ్రగ్ కంట్రోల్ అధికారులు, అనుమతులు లేని ఔషధాల విక్రయం లేదా గడువు తీరిన మందుల నిల్వపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సూచనలు ఇచ్చారు. సామాన్య ప్రజలను ఆడుకోవడంలో మందు షాపులకు కూడా అలవాటు అయిందని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన నియమాలు పాటించని ఔషధాల షాపులపై కూడా నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలని అధికారులకు సామాన్య ప్రజలు సలహాలు ఇస్తున్నారు. అలాంటప్పుడే సరైన ఔషధాలను షాప్ యాజమానులు ప్రజలకు చేకూర్చుతారని ఆశిస్తున్నారు.
Read also : రావిర్యాల చేరువు కట్టకు పొంచి ఉన్న ముప్పు.. భారీ స్థాయిలో ఏర్పడిన గండి?