Friday, February 20, 2026
HomeజాతీయంGorakhpur Cataract Surgery Tragedy: అయ్యో పాపం.. వికటించిన కంటి వైద్యం, ఏకంగా 9 మంది...

Gorakhpur Cataract Surgery Tragedy: అయ్యో పాపం.. వికటించిన కంటి వైద్యం, ఏకంగా 9 మంది కళ్లు తీసేశారు!

  • ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల క్యాటరాక్ట్‌ ఐ ఆపరేషన్స్ ఫెయిల్
  • చూపు కోల్పోయిన సుమారు 18 మంది  
  • ఉత్తరప్రదేశ్‌ లోని గోరఖ్‌ పూర్‌లో దారుణం

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్సలు విఫలమై దాదాపు 18 మంది చూపు కోల్పోయారు. ఇందులో 9 మంది కళ్లను వైద్యులు పూర్తిగా తొలగించగా, మరో 9మంది కన్ను ఉన్నా చూపు మాత్రం పోయింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

గోరఖ్‌పూర్‌లోని న్యూరాజేశ్‌ హైటెక్‌ ఆస్పత్రిలో ఫిబ్రవరి 1న నిర్వహించిన వైద్య శిబిరంలో 30 మంది రోగులకు క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్సలు చేశారు. కొద్ది గంటలకే శస్త్రచికిత్స జరిగిన కంటిలో నొప్పి, నీరు కారడం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందిపడ్డారు. ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డ 18మందిని గుర్తించి ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుండా ఉండేందుకు 9మంది బాధితులకు శస్త్రచికిత్స జరిగిన కన్నును వైద్యులు తొలగించారు.

విచారణకు ప్రభుత్వం ఆదేశం

అటు ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అటు ఈ ఆపరేషన్స్ నిర్వహించిన హాస్పిటలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆర్డర్స్ జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన యూపీలో సంచలనంగా మారింది.

Read Also: ఉచితాలు ఎంతకాలం? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments