తెలంగాణ

మేడారం జాతర పనులు ఈనెల 20 లోపు పూర్తవుతాయి : మంత్రి పొంగులేటి

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మేడారంలో సమ్మక్క- సారలమ్మ జాతర ఎంత ఘనంగా జరుగుతుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జాతరకు సంబంధించి అన్ని పనులు కూడా పూర్తయ్యే స్టేజ్ లో ఉన్నాయి. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం జాతర పనులను మంత్రి సీతక్కతో కలిసి సమీక్షించారు. ఈనెల 20వ తేదీ లోపు ఈ మేడారం జాతర పనులు పూర్తవుతాయి అని… ఈసారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశాము అని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 19వ తేదీన రాత్రి మేడారం లోనే బస చేస్తారు అని స్పష్టం చేశారు. అనంతరం మరుసటి రోజు 21 తేదీన ఈ వన దేవతలను దర్శించుకుంటారు అని వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మన తెలంగాణలో ఈ గిరిజన జాతర జరుగుతుంది అని.. ఈ జాతరను చూడడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈసారి మేడారం అభివృద్ధిని ఈ ప్రభుత్వం ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేస్తుంది అని తెలిపారు. ఇంకా జాతర మొదలుకానే కాలేదు… కానీ ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు అని.. కాబట్టి ఇప్పటినుంచే వారి అవసరాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అని తెలియజేశారు. గతంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎక్కడా కూడా భక్తులకు అలాగే ట్రాఫిక్ విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము అని అన్నారు.

Read also : ఉదయం లేచాక ఈ లక్షణాలు కనిపిస్తే మీరు డేంజర్‌లో ఉన్నట్లే!

Read also : ముగ్గురు పిల్లలు, 9 నెలల గర్భిణీ భార్యను పోషించలేక షాకింగ్ పని చేసిన 30 ఏళ్ల వ్యక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button