సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు అసెంబ్లీ రామచంద్రాపురం మండలం వెలిమెల లో ప్రభుత్వ భూముల కబ్జా నిరసిస్తూ మెదక్ ఎంపీ, బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ధర్నా నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా అక్కడికి వచ్చేసి నిరసనకారులను మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులపై రెచ్చిపోయారు వకీల్ సాబ్. దాదాపు 15 వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. బడబాబులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు.
స్థానికులతో కలిసి ఎంపీ రఘునందన్ రావు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో ధర్నా చేస్తున్న జనాలను
అరెస్ట్ చేసి పఠాన్ చెరు పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు.రఘునందన్ రావును కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో రఘునందన్ రావు వాగ్వాదానికి దిగారు.
2000 కోట్ల భూ కుంభకోణం, అక్రమ రిజిస్ట్రేషన్ల వెనుక ఎవరున్నా వదిలేదు లేదన్నారు ఎంపీ రఘునందన్ రావు. పేదలకు లేదా ప్రభుత్వానికే దక్కాల్సిన భూమి , వారికోసం ఎంత దూరం అయినా కొట్లడుతానని స్పష్టం చేశారు. .