
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మా కుటుంబం మధ్య ఆస్తి లేదా కుటుంబ వైరాలు ఉన్నాయంటూ వచ్చేటువంటి వార్తలు అన్నీ కూడా ఫేక్ అని… ఎవరు కూడా దయచేసి అలాంటివి పట్టించుకోవద్దు అని కవిత అన్నారు. ఆడ వ్యక్తినని తీసుకెళ్లి ఆరు నెలలు తీహార్ జైల్లో పెడితే.. కృంగిపోయి.. డిప్రెషన్ కు గురై ఇంట్లోనే కూర్చుంటానని చాలామంది అనుకుని ఉంటారు. కానీ నేను చాలా ధైర్యం ఉన్న తెలంగాణ ఆడబిడ్డను అని.. ఆమె స్పష్టం చేశారు. ఒక ఆడబిడ్డగా నా భుజాలపై చాలా బరువు ఉంటుంది అని.. మరీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలు భయపడకూడదని నేను ధైర్యంగా బయటకొచ్చి ఇలా రాజకీయంలో యుద్ధం చేస్తున్నాను అని ఆమె అన్నారు. రాజకీయంలో ఉన్నా కదా… ఈ రాజకీయ బాటలో రాబోయే రోజుల్లో మరిన్ని అవమానాలు.. ఇకనుంచి ఇంకా ఎంతమందో నన్ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని కవిత అన్నారు. రెండు రోజులు జైల్లో వేస్తే ఇంట్లో కూర్చుంటాను అనడం పాత రోజులని.. డిప్రెషన్, కోపంతో ఇంట్లోనే ఉండిపోతాను అని అనుకోవద్దు.. నేను చాలా ధైర్యవంతురాలును అని.. ఎలాంటి సమస్య వచ్చినా ఎదురండి నిలబడి పోరాడే శక్తి నాకుంది అంటూ కవిత వెల్లడించారు. కాగా ఆమె ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయి బయటకు వచ్చిందో ఆమెపై పలు రకాలుగా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మా కుటుంబం మధ్య ఎలాంటి ఆస్తి మరియు వ్యక్తిగత వివాదాలు లేవు అంటూ ఆమె స్పష్టం చేశారు.
Read also : Viral News: వద్దన్నా ముద్దు పెట్టిన ప్రియుడు, నాలుక కొరికేసిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్!
Read also : Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, 22 నుంచి భారీ వర్షాలు!





