
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు సౌతాఫ్రికా మధ్య జరగాల్సినటువంటి నాలుగో టి20 మ్యాచ్ నిన్న పొగ మంచు కారణంగా రద్దు అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలంలో నార్త్ స్టేట్స్ లలో భారీగా పొగ మంచు కురుస్తుంది అని ముందుగానే తెలుసు కదా.. అయినా కూడా అక్కడే వేదికలు సెలెక్ట్ చేయడం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కచ్చితంగా నార్త్ లోని స్టేడియాల్లోనే మ్యాచ్ జరిపించాలని మీరు ఫిక్స్ అయితే మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ వేయాల్సింది కదా అని సూచిస్తున్నారు. ఇక ఈ శీతకాలంలో నార్త్ రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాల్లో పొగ మంచు చాలా తక్కువగా కురుస్తుంది.. అలాంటప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడానికి పరిశీలనలు చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : Viral Video: నిధి అగర్వాల్‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్
కాగా నిన్న లక్నోలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా ప్రమాదకర స్థాయిలో AQI 391గా రికార్డు అవ్వడంతో అంపైర్లు ఆట సాధ్యం కాదు అని వెంటనే ప్రకటించారు. ఏది ఏమైనా కూడా ఈ స్టార్ ఆటగాళ్ల ఆటను చూడాలి అని ఎంతోమంది కూడా ఫ్యాన్స్ టీవీల ముందు ఆసక్తికరంగా కూర్చొని ఉన్నారు. ఎలాంటి ముందు చూపు లేకుండా ఇలాంటి స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి ఆటంకాల కారణంగా మ్యాచ్ రద్దు అవ్వకుండా చూడాలి అని అంటున్నారు. కాగా ఇక చివరి టి20 మ్యాచ్ అహ్మదాబాద్ లో ఈనెల 19వ తేదీన జరగనుంది.
Read also : Sreeleela: బాత్ రూమ్ ఫోటోలు వైరల్.. శ్రీలీల షాకింగ్ రియాక్షన్!





