
క్రైమ్ మిర్రర్, అల్లూరి సీతారామ రాజు జిల్లా:- మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటికే ఎంతో మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.. కీలక నేతలు సైతం హతం అయ్యారు.. మరోవైపు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు కూడా.. ఈ సమయంలో కీలక నేతగా ఉన్న హిడ్మా ఎక్కడ? హిడ్మా కూడా లొంగిపోతారా? అనే చర్చ జరిగింది. అయితే, అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతని భార్య హేమతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
Read also : శాలివాహనకు శనిగ్రహం.. కబ్జా కోరల్లో విద్యాలయం..!
Read also : ఏపీలో మరో బస్సు ప్రమాదం.. పూర్తిగా దెబ్బతిన్న ఎడమ భాగం!





