
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అబార్షన్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. గత ఐదేళ్లలోనే మరీ దారుణంగా ఈ సంఖ్య పెరిగిపోవడంతో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండడం అనేది చాలామందిని కలిచివేస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మరోవైపు తెలంగాణలో ఒకేసారి అంత పెరగడం చూసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 367% పెరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అబార్షన్లు 917% పెరిగాయి.
Read also : డిప్యూటీ సీఎం ఆదేశం.. వెంటనే ప్రారంభిస్తాను బాలినేని!
తెలంగాణ రాష్ట్రంలో 2020-21లో 1578 అబార్షన్లు జరిగాయి. అది 2024-25 లో ఆ సంఖ్య ఏకంగా 16,059 పెరిగింది. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,676 అబార్షన్ల కేసులు నమోదయ్యాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 4-5 సంవత్సరాలలో దాదాపు 27 వేల అబార్షన్ల కేసులు నమోదయ్యాయి. ఇక 25,884 అబార్షన్లతో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఈ గణాంకాలు అన్నిటిని కూడా తాజాగా కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో సమర్పించడంతో ప్రతి ఒక్కరు కూడా అవాక్కయ్యారు. లోపల జరుగుతుంది ఒకటైతే.. బయట జరుగుతుంది మరొకటి. మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 50 వేలకు పైగా కేసులు నమోదు అయితే.. ఇక దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయి ఉంటాయో అనేది ఎవరూ కూడా ఊహించలేరు. ఈ అబార్షన్ల సంఖ్య చూసి చాలామంది జనం కూడా షాక్ అవుతున్నారు.