
మునుగోడు, క్రైమ్ మిర్రర్:- వేళ ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న వర్గాల ఆత్మగౌరవ ప్రత్యేక మనుస్మృతి దహనం అని మాలమహానాడు నాయకులు పెరుమాళ్ల ప్రమోద్ కుమార్, బొల్లు సైదులు అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మనుస్మృతి పత్రాలను మాలమహానాడు ఆధ్వర్యములో దహనం చేశారు. మాలమహానాడు నాయకులు పెరుమాళ్ల ప్రమోద్ కుమార్, బొల్లు సైదులు మాట్లాడుతూ… మానవ హక్కుల కోసం సాగిన ఒక చారిత్రాత్మక ధిక్కారస్వరం ,చెరువు నీటిని అంటరాని వారు తాగే హక్కు కోసం అంబేద్కర్ సత్యాగ్రహం చేశారన్నారు.మనుషులు తాగే నీటిని జంతువులు తాగొచ్చు కానీ తోటి మనుషులు తాగితే అపవిత్రం అవుతుందనే అవమానియా ఆలోచన వెనుక మూలాలను అంబేద్కర్ అన్వేషించారనీ గుర్తుకు తెచ్చారు.
Read also : రెండో రోజు మ్యాచ్ లో ఒక స్టార్ డక్ ఔట్, మరో స్టార్ విజృంభన!
ఆ వివక్షకు మూలమే మనుస్మృతి అని గుర్తించారు. మనుస్మృతిలోని అవమానియా సూత్రాలు ఎలా అడ్డుపడుతున్నాయో ప్రజలకు ఆనాడు వివరించారు. మనుస్మృతి భారత రాజ్యాంగ రచనకు పునాది అని చెప్పవచ్చు. ఇది ఒక చారిత్రక ఘట్టం కాదు నిరంతర ప్రక్రియ అన్నారు. బొల్లు సైదులు,బెల్లం శివయ్య, బొల్లు రామలింగయ్య,వడ్డేపల్లి దుర్గా ప్రసాద్, బొల్లు పరమేష్,బసనగర రాములు, పెరుమాళ్ళ శ్రీరామ్ కుమార్,,ముచ్చపోతుల భరత్, బేరే అశోక్,గాలి జీవన్,సైదులు గ్రామస్థులు పాల్గొన్నారు.
Read also : తగ్గనున్న చలిగాలులు.. ఇందులో నిజం ఎంత?
Read also : ఎన్నికకో పార్టీతో పొత్తు పెట్టుకుని సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు : కాకాణి గోవర్ధన్





