
Train Accident: గత కొద్ది కాలంగా నార్త్ లో సెల్ ఫోన్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రైలు ప్రయాణీకులే టార్గెట్ గా దొంగలు రెచ్చిపోతున్నారు. రైలు డోర్లు, విండోల దగ్గర సెల్ చూసే వారి నుంచి లాక్కుని వెళ్లిపోతున్నారు. అడపా దడపా దొంగలు దొరికినప్పటికీ, దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ సెల్ ఫోన్ దొంగతనం ఓ రైలు ప్రయాణీకుడికి తీరని విషాదాన్ని నిపింది. డోరు దగ్గర కూర్చొన్న ప్రయాణీకుడి ఫోన్ దొంగిలించే ప్రయత్నం చేశాడు ఓ దొంగ. తన ఫోన్ ను కాపాడుకునే ప్రయత్నంలో యజమాని రైలు కిందపడిపోయాడు. అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ముంబైకి చెందిన గౌరవ్ నికమ్ అనే వ్యక్తి తాజాగా లోకల్ ట్రైన్ ఎక్కాడు. డోరు దగ్గర కూర్చున్నాడు. రైలు షాహద్, అంబివ్లీ స్టేషన్ల మధ్యలో వెళుతోంది. ఆ సమయంలో ఓ దొంగ డోరు దగ్గర కూర్చున్న గౌరవ్ చేతిలో మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. గౌరవ్ గట్టిగా ఫోన్ పట్టుకోవటంతో ట్రైన్ లోంచి కిందపడ్డాడు. అతడి రెండు కాళ్ల మీది నుంచి రైలు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ కాలు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
దొంగ కోసం పోలీసుల గాలింపు
వెంటనే సమాచారాం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ట్రాక్ పక్కన పడి ఉన్న గౌరవ్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగ కోసం గాలిస్తున్నారు.
Read Also: కాలువలోకి దూసుకెళ్లిన డొలేరో వాహనం, 11 మంది స్పాట్ డెడ్..