
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- మంచు ఫ్యామిలీ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. మంచు మనోజ్ తాజాగా తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు కూర్చుని నిరసన చేపట్టాడు. దీంతో వెంటనే జల్ పల్లి లోని మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ ఎక్కడో వేరేచోట నివాసం ఉండగా… ఇవాళ జలపల్లి లోని మోహన్ బాబు ఫామ్ హౌస్ కు వచ్చారు. ఫార్మ్ హౌస్ లోకి వెళ్లడానికి కోర్టు నాకు అనుమతి ఇచ్చిందని చెబుతూ మంచు మనోజ్ ఫామ్ హౌస్ లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మంచు మనోజ్ను అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో వెంటనే మంచు మనోజ్ ఫామ్ హౌస్ ముందే కూర్చుని నిరసనకు దిగారు. మంచు మనోజ్ వస్తున్నాడు అన్న సమాచారం పోలీసులకు అందగానే అక్కడికి భారీగా పోలీసులు చేరుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. దాదాపుగా 100మంది పోలీసులు ఫామ్ హౌస్ టు ఉన్నట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.
ఇప్పటికే తన ఇంట్లోని కారు, మరి కొన్ని వస్తువులు ఎవరో తీసుకువెళ్లారని మంచు మనోజ్ నార్సింగి పోలీసులకు కంప్లైంట్ చేశారు. చోరీకి గురైన కారు… వెళ్లిన మార్గాన్ని పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ సమీపంలో దొంగలు వదిలి వెళ్ళిన మనోజ్ కారు పోలీసులకు లభ్యమైనది. వెంటనే ఆ కారును స్వాధీనం చేసుకొని న్యాయస్థానంలో డిపాజిట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే ఆ కారును దొంగలించింది మంచి కుటుంబంలోని సభ్యులా లేక ఎవరైనా బయటవారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
-
జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్..!
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
-
ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్