క్రైమ్ మిర్రర్,మహాదేవపూర్:- విద్య, సామాజిక సేవా రంగాల్లో అందిస్తున్న సేవలకుగాను జయశంకర్ జిల్లా మహాదేవపూర్ రైసింగ్ స్టార్ స్కూల్ కరస్పాండెంట్ మంజుల కు గౌరవ డాక్టరేట్ లభించింది. ఆదివారం చెన్నైలో జరిగిన ఇంటర్నేషనల్ తమిళ్ కల్చరల్స్ యూనివర్సిటీ నుండి మహాదేవపూర్ రైసింగ్ స్టార్ హై స్కూల్ కరెస్పాండంట్ మంజుల కి విద్యారంగం లో చేసిన సేవకి డాక్టర్ అఫ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి డాక్టరేట్ తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఫార్మర్ సివిల్ జడ్జి డా.వెంకటేశన్, డా.నిరోషా, ఛాన్సెలర్ డా.నాగరాజన్, డైరెక్టర్ అఫ్ లీగల్ అడ్వైసర్ బోర్డు వైస్ ఛాన్సెలర్ డా.మణికండ రాజా చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. గతంలో మంజులకి సావిత్రి బాయ్ పూలె అవార్డు, నంది అవార్డు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, స్కూల్ అఫ్ ఎక్ససులెన్స్ అవార్డు ఇలా ఎన్నో అరుదైన గౌరవ అవార్డులు పొందడం జరిగింది. గౌరవ డాక్టరేట్ డిగ్రీ కేవలం ఒక ఉత్సవ బిరుదు కంటే ఎక్కువ, ఇది శ్రేష్ఠత, నాయకత్వం మరియు సామాజిక ప్రభావం యొక్క ఆదర్శాలను సూచిస్తుంది. విద్యా సంస్థలు తమ రంగాలలో అత్యుత్తమ సేవ లేదా అద్భుతమైన విజయాలు చూపిన వ్యక్తులకు ఈ గౌరవాన్ని అందిస్తాయి. మండలానికి చెందిన మంజుల కి డాక్టరేట్ రావడం పట్ల మండలంలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేసారు.
తగ్గేదేలే.. తేల్చి చెప్పిన కొడాలి నాని!
ఆమనగల్లు: 12 గంటలపాటు దేవాలయం మూసివేత..!
