మంచు మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ మంటలు రేగాయి. అన్న మంచు విష్ణుతో పాటు వినయ్ పై పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశాడు మనోజ్. 7 అంశాల మీద పోలీసులకు ఆధారాలు సమర్పించారు. విష్ణు నుంచి తనకు పానహాని ఉందంటూ.. ఏడు పేజీల ఫిర్యాదుని పోలీసులకు పంపించారు మంచు మనోజ. తల్లిదండ్రులు లేని తమ భార్య భూమా మౌనికారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గపు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
నన్ను, నా భార్య, నా పిల్లల పై దాడికి ప్రయత్నించారని..అప్పుడే నేను 100కి కాల్ చేసానని మనోజ్ చెప్పారు.
కిరణ్, విజయ్ రెడ్డి మా ఇంట్లోకి అక్రమంగా చొరబడి నాపై దాడి చేసిన సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ దొంగిలించారని తన ఫిర్యాదు కాపీలో మనోజ్ పొందుపరిచారు. నాపై దాడి జరిగిన సాక్ష్యాలు లేకుండా చేశారన్నారు. దాడి జరిగినప్పటికీ, నా కుటుంబ సభ్యులపై నేను ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని.. కాని నా భార్యను అనవసరంగా గొడవల్లోకి లాగారని తెలిపారు. మా నాన్న చేసిన చర్యలతో నేను తీవ్రంగా బాధపడ్డానని మంచు మనోజ్ వెల్లడించారు .
మంచు మనోజ్ ఫిర్యాదు కాపీలో సంచలన అంశాలు ఉన్నాయి. విష్ణు అనుచరులు వినయ్ మహేశ్వరి, విజయ్ రెడ్డి, కిరణ్, రాజ్ కొండూరు, శివ, వన్నూరులపై కూడా ఫిర్యాదు చేశారు. అన్న విష్ణు తోపాట అతని అనుచరుల నుంచి తనకు, తన భార్యా పిల్లలకు ప్రాణ హాని ఉందని చెప్పారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం, ట్రస్టులో నిధుల దుర్వినియోగం జరిగిందని.. దీన్ని బయట పెట్టినందుకు తనపై కుట్రలు పన్నారని మంచు మనోజ్ తెలిపారు.
నన్ను చంపుతానని బెదిరించారని.. తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపి వేయమని నేను రాసినట్టు ఫేక్ లెటర్ విద్యుత్ శాఖ కి పంపారని వెల్లడించారు. నా ఇంటికి నీటి సరఫరా నిలిపివేశారు… నేను ఇంట్లో నుంచి వెల్లిపోయేలా మానసికంగా హింసిస్తున్నారని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.