మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు జరిగినటువంటి సంఘటన జరిగింది. అదికూడా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న మోహన్ బాబు తన సొంత కొడుకు పై కేసు నమోదు చేశాడు. ఆస్తి వివాదంలో మోహన్ బాబు మరియు తన తనయుడు మంచు మనోజ్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారట. అనంతరం పోలీస్ స్టేషన్లో నా పై దాడి చేశాడంటూ మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారట. ప్రస్తుతం ఈ సంఘటన అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా చేరింది. దీంతో అందరూ కూడా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు.
Read More : రేవతి చనిపోయిందని మరుసటి రోజు తెలిసింది.. సారీ చెప్పిన అల్లు అర్జున్
టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి పేరున్న మోహన్ బాబు ప్రస్తుతం అటు సినిమాల్లోనూ నటించకుండా తనకు వచ్చినటువంటి గుర్తింపును అంతా కూడా నాశనం చేసుకున్నారు. అయితే తాజాగా తన కొడుకు మంచు మనోజ్ తో స్కూలు అలాగే ఆస్తులు విషయంలో వివాదాలు తలెత్తాయంట. అయితే ఇప్పటికే ఈ విషయంలో ఏ మాత్రం వాస్తవం లేదని కొన్ని వార్త కథనాలు అయితే వెల్లడించాయి. కొన్ని మీడియా ఛానళ్లు మంచు ఫ్యామిలీ పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయంటూ మంచి ఫ్యామిలీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటికి మాకు ఏ సంబంధం లేదని అందులో ఎటువంటి నిజం లేదని చెప్పుకొచ్చారు.
Read More : పరుగు పందెంలో హుస్సేన్ బోల్ట్ రికార్డ్ బ్రేక్ చేసిన గౌట్
అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలలో మంచు మనోజ్ మరియు మోహన్ బాబు ఇద్దరూ కూడా పరస్పర వివాదాలతో పోలీస్ స్టేషన్ వరకు వచ్చారన్న వార్తలు అయితే ప్రస్తుతం నెట్టింటా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే మంచు మనోజ్ మరియు మోహన్ బాబు గొడవ చేసుకున్న సందర్భంలో మంచు మనోజ్ కు గాయాలైనట్లుగా, ఆ దెబ్బలతోనే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి మా నాన్న నాపై దాడి చేశారన్నట్టుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఇక ఏ మీడియా కథనాలు వెల్లడించాయి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని మంచు ఫ్యామిలీ తేల్చి చెప్పారు.