
పెబ్బేరు, క్రైమ్ మిర్రర్ : వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తీర్థయాత్రకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటనపై పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెబ్బేరు పట్టణానికి చెందిన ప్యారసాని సత్యనారాయణ అనే వ్యక్తి ఈ నెల ఆగస్టు 3న తమిళనాడులోని అరుణాచలం (తిరువన్నామలై) వెళ్తున్నానని ఇంట్లో తెలిపి, గద్వాల్లో ట్రైన్ ఎక్కాడు. ఆ తరువాత ఆగస్టు 5 వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిండు. అయితే ఆ తరువాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వగా, ఎక్కడ ఉన్నాడన్న సమాచారం అందుబాటులోకి రాలేదు.
సత్యనారాయణ తరచూ తీర్థయాత్రలకు వెళ్తుండటంతో మొదట్లో కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, వారాల తరబడి ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆయన తల్లి సుశీలమ్మ ఈ నెల 12న పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, కానీ ఇప్పటివరకు ఆయన ఆచూకీ లభించలేదని తెలిపారు.
సత్యనారాయణ ఎక్కడైనా కనిపిస్తే లేదా ఆయన గురించి సమాచారం తెలిసినవారు వెంటనే క్రింది ఫోన్ నంబర్లకు సంప్రదించాలని పోలీసులు కోరారు.
ఫోన్ : 96718862305, 9381944500, 8712670624