
Nagpur Tragedy Video: మహారాష్ట్రలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరు అయ్యో అంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రమాదంలో చనిపోయిన భార్యను తన ఇంటికి తీసుకెళ్లేందుకు ఎవరూ సాయం చేయకపోవడంతో.. బైక్ మీద కట్టుకుని తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గటన నాగ్ పూర్ లో జరిగింది. నాగ్ పూర్- జబల్ పూర్ జాతీయ రహదారిపై తన భార్య మృతదేహాన్ని తీసుకెళ్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ నెట్టింట పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసి అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా అమిత్ తన భార్యతో కలిసి నాగ్ పూర్- జబల్ పూర్ జాతీయ రహదారి మీద ప్రయాణిస్తున్నాడు. అమిత్ భార్య తన సోదరుడికి రాఖీ కడతానంటే తీసుకెళ్తున్నాడు. డియోలాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్ఫాటా దగ్గరికి వెళ్లగానే.. వారు ప్రయాణిస్తున్న బైక్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో అమిత్ భార్య స్పాట్ లోనే చనిపోయింది. ప్రమాదం తర్వాత అమిత్ ఆ రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులను సాయం చేయాలని కోరాడు. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. చూసి చూడనట్టు వెళ్లిపోయారు. ఏం చేయాలో తెలియక, తన భార్య మృతదేహాన్ని బైక్ మీద కట్టుకున్నాడు. వచ్చిన దారిలోనే తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. అతడిని చూసి కొందరు వాహనదారులు ఆపేందుకు ప్రయత్నించారు. కానీ, తను వారి మాటలు పట్టించుకోకుండా బైక్ ఆపకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి అయ్యో పాపం అంటూ కంటతడి పెడుతున్నారు.
Read Also: ఎస్పీజీలో తొలి మహిళా అధికారి.. ఇంతకీ ఎవరీ అదాసో కపెసా!