
సంస్థాన్ నారాయణపురం, క్రైమ్ మిర్రర్ :-ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణపురం మండలంలోని కడిలబాయి తండా లో జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలంలోనీ పిల్పలపహాడ్ గ్రామానికి చెందిన దండుగుల రంజిత్ కంప్రెషర్ ట్రాక్టర్ పై డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్ పని నిమిత్తం ఆరుట్ల గ్రామానికి వెళ్తుండగా రాచకొండ ప్రాంతంలోనీ కడీలబావి తండ మూలమలుపు వద్ద ఎదురుగా డీసీఎం వస్తుండడంతో ట్రాక్టర్ ను రోడ్డు దింపే క్రమంలో ప్రమాదవశాత్తు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో రంజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హిజ్రాలపై పోలీసుల ఉక్కుపాదం… యువతను చెడు మార్గం వైపు తిప్పుతున్నారని ఆగ్రహం