తెలంగాణ

అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ ను రద్దు చేయాలి : మల్లన్న

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళా చనిపోవడం వల్ల ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ గురించి ప్రతిరోజు బాధ్యుడిని చేస్తూ చాలామంది ఎన్నో రకాలుగా తిడుతున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్కి గతంలో వచ్చినటువంటి నేషనల్ అవార్డును కూడా రద్దు చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇవాళ డిమాండ్ చేశారు. దీంతో ఇప్పట్లో అల్లు అర్జున్ గురించి కథనాలు అయితే ఆగేటట్టు లేవు.

నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు…”ఫాస్టెస్ట్ చెక్ మేట్ సల్వార్”గా ఘనత

అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమా అనేది ఎర్రచందనం దొంగలను మరింత ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పోలీసుల వ్యవస్థను అలాగే పోలీసుల మనోభావాలను కూడా దెబ్బతీసిందని అన్నారు. సమాజానికి ఒక చెడు మెసేజ్ ఇచ్చినటువంటి సినిమాకి నేషనల్ అవార్డు ఇవ్వడం సరి కాదని తెలియజేశారు. బన్నీకి ఇచ్చిన నేషనల్ అవార్డు అనేది కచ్చితంగా తిరిగి తీసుకోవాలని పలు రకాలుగా తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.

అల్లు అర్జున్ ఇంటిపై దాడి!…

ఇక పుష్ప సినిమాని ప్రారంభించి ఎన్నో విధాలుగా ఎంతోమందిని దొంగలుగా ప్రోత్సహిస్తున్న డైరెక్టర్ సుకుమార్ను కూడా వెంటనే అరెస్టు చేయాలని ఆయన కోరారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి సోషల్ మీడియాలలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం బన్నీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే చర్చలు జరుగుతున్నాయి. ఒకపక్క సినిమా పెద్ద హిట్ అయిన కూడా తనకి మాత్రం ఇది ఒక నిరాశనే చెప్పవచ్చు. అసలు ఇందులో ఎవరిది తప్పు అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.

హనీ ట్రాప్ చేసి ఆటో డ్రైవర్ హత్య.. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button