క్రైమ్తెలంగాణవైరల్

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మాల్ మార్కెట్..!

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మాల్ మార్కెట్..!

పట్టించుకోని మార్కెట్ కమిటీ, అధికారులు..!

మందు, చిందు, విందులకు మార్కెట్ ఆధారం.

ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం.. మురికిమయం.

మల మూత్ర విసర్జనలు, అంతులేని దోమలు ఈగలతో ఇబ్బందులు..

చీకటి ముసుగులో యువత వీరంగం.. దూమపానాలతో మార్కెట్ దుమారం..

పెచ్చులూడిన మార్కెట్ కార్యాలయం..మీదపడి నెత్తి పగిలే అవకాశం.

విచ్చలవిడి తనానికి నిఘా కరువు.. అడ్డుపడకపోతే ఆగమే..!?

నల్లగొండ,క్రైమ్ మిర్రర్:- అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది మాల్ మార్కెట్.. మందు, విందు వినోదంతో పాటు పలు రకాల సెటిల్మెంట్ దందాలు, ఇల్లీగల్ పనులకు మూలంగా మారింది మాల్ మార్కెట్ ప్రాంగణం. చీకటి పడితే చాలు ఆకతాయిల అల్లర్లతో, సిగరేట్ దమ్ములతో మార్కెట్ మొత్తం హోరెత్తిపోతుందంటున్నారు స్థానికులు..! భూత్ బంగ్లా పరిసర ప్రాంతంలా ఉండే మాల్ మార్కెట్, కొంతమంది గ్యాంగ్ కు ఆధారంగా నిలుస్తుందని ప్రచారం. కొంతమంది చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని, టైంపాస్ కోసం గుంపులుగా చేరి, రాత్రి సమయాలలో జాగారం చేస్తున్నారని వినికిడి..

ఎక్కడ చూసినా చెత్తాచెదారం.. మురికి కూపం

మాల్ మార్కెట్ ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో, కుళ్ళిన కూరగాయల కుప్పలతో, ఈగలు దోమలతో పరిసర ప్రాంతాలు వికృత రూపం దాలుస్తుందంటున్నారు. ప్లాస్టిక్ కవర్లు, బస్తాలు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. మల మూత్ర విసర్జనలు, ఎక్కడ పడితే అక్కడ చెయ్యడంతో అక్కడక్కడా దుర్వాసనలు వెదజల్లుతున్నాయని అంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ కమిటీ, అధికారుల, పట్టింపు లేకపోవడంతో మాల్ మార్కెట్ మలినమైపోతుందంటున్నారు ప్రజలు. పరిసర ప్రాంతాలే కాదు, కార్యాలయం పరిస్థితి కూడా గోరంగా ఉందంటున్నారు చూపరులు. పై కప్పు పెచ్చులూడి నెత్తి పగిలే పరిస్థితి కనపడుతుంది. శిధిలావ్యస్థలో ఉన్న కార్యాలయం, నిండు నిర్లక్ష్యానికి నాంది పలుకుతుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని, మాల్ మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెడుతూ, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి చెక్ పెట్టాలని, కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టి అభివృద్ధికై ప్రణాళికలు వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

Read also : అప్పట్లో HYB అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. నేడు వైజాగ్ కు 10 ఏళ్లు చాలు : లోకేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button