
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- ప్రస్తుత కాలంలో మైనర్లు మొబైల్ ఫోన్లు చాలా ఎక్కువ సేపు చూస్తున్నారు. ముఖ్యంగా రెండు మూడు సంవత్సరాల నుంచే మొబైల్ ఫోన్లకు పిల్లలు అలవాటు పడుతున్నారు. చివరికి చిన్న పిల్లలు ఏడుపు ఆపాలన్నా లేక తినను అని మారం చేసిన కూడా తల్లిదండ్రులు వెంటనే మొబైల్ ఫోన్ లను చూపించి తినిపిస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్లతోనే చిన్నపిల్లలు సైబర్ నేరాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోనే తాజాగా సోషల్ మీడియాకు చిన్న పిల్లలు బాగా ఎడిట్ అవుతున్న సందర్భంలో మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించాలని మలేషియా నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం 2026 లో అమల్లోకి రానుంది అని తెలిపారు. సైబర్ నేరాలు మరియు బెదిరింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మలేషియా అధికారులు వెల్లడించారు. ఒకవేళ పిల్లలు సోషల్ మీడియా వాడితే కనుక వెంటనే పేరెంట్స్ కు ఫైన్ వేయాలి అని ఆ ప్రభుత్వం భావిస్తుంది అట. మరోవైపు ఆస్ట్రేలియాలో కూడా డిసెంబర్ నుంచి టీనేజర్లకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇండియాలో కూడా ఇలాంటి రూల్ ను తీసుకురావాలి అని చాలామంది పేరెంట్స్ కోరుతున్నారు. ఇప్పటికే ఇండియాలో చాలామంది పిల్లలు సోషల్ మీడియాలోనే జీవితం గడిపేస్తున్నారు.
Read also : ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత చికిత్స.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
Read also : నా దగ్గర ఉన్న వాచ్ ల విలువ 60 కోట్లు.. కానీ నాకు అదే ఇష్టం : హీరో ధనుష్





