
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరు,మహేశ్వరం మండలాలలో రేపు జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో శ్రీరాములు మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే సాధ్యమవుతుందని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో గ్రామాల్లో రహదారులు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అలాగే రైతుకు రైతు వేదిక, క్రీడా ప్రాంగణాలు, వీధి దీపాలు, పల్లె ప్రకృతి వనాలు, స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్లు వంటి సుమారు 46 కేంద్ర పథకాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
అందుకే గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకోవాలని కోరుతూ, మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Read also : Sleep: రాత్రి పూట నిద్రపోయేటప్పుడు బెడ్‌రూమ్‌లో లైట్లు ఆపేయాలా? ఆన్‌లో ఉంచాలా?
Read also : మహేశ్వరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ భద్రత ఏర్పాటు : అడిషనల్ డీసిపీ సత్యనారాయణ





