హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: బాచుపల్లి సమీపంలో ప్రగతినగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో ఫుట్ పాత్‌పై నిర్వహిస్తు జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల షాపులు సైతంఒక్కొక్కటిగా మంటలు అంటుకొని కాలిబూడదయ్యాయి. ఈ మంటల్లో దాదాపు 50 షాపులకు పైగా కాలిపోయాయి. కాగా మంటల్లో రూ.కోటి విలువైన ఫర్నిచర్ దగ్దమైనట్లు సమాచారం.
ఈ విషయమై సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయాంలో భారీగా పొగలుకమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. కాగా చిరు వ్యాపారుల దుకాణాలు మంటల్లో కాలిపోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. తాము రోడ్డున పడ్డామని మేము బ్రతికేది ఎలా అని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని పలువురు కోరారు.
