
-
ఆలయాలను తలపిస్తున్న సినిమా థియేటర్లు
-
ప్రజల్లో ఎంత భక్తి ఉందో తెలిపే సినిమా..
-
చిన్న, పెద్ద తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్న జనం!
-
మరో దైవ రికార్డ్ సృష్టించిన “మహావుతార్ నరసింహ”
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః”.. అనే మహావిష్ణు దైవ నామం మహవతార నరసింహ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ చిత్రం నేడు అన్ని థియేటర్లలో చాలా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ రికార్డులను సృష్టిస్తుంది. ఒకవైపు వసూళ్లను.. మరోవైపు డైరెక్టర్లకు మరియు నిర్మాతలకు పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది. తాజాగా ఈ మహవతార నరసింహ సినిమాకు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఏ థియేటర్లోకి వెళ్లిన బయట చెప్పులు కనపడుతున్నాయంటే… థియేటర్లో ఆడుతున్న సినిమా దైవానికి సంబంధించి అని అర్థమవుతుంది. దీంతో థియేటర్లే ఆలయాలను తలపించేలా ఉన్నాయి. ఎక్కడ నరసింహస్వామి పోస్టర్ కనపడ్డా చిన్నపిల్లలు, పెద్దవారు అక్కడి నిలబడి నమస్కారం చేసుకుంటున్నారు. సినిమాలోని నరసింహుడి అవతారం, ఆ గర్జన చూసి ప్రతి మనిషి కూడా పరవశించి పోతున్నారు. మరి కొంతమంది తబలాలతో థియేటర్లలోకి వెళ్లి భజనలు కూడా చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది అని అంటూ చాలా మంది నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమా చూడడానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాలోని ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు నరసింహ అవతారం గురించి తెలియని వారు ఈ సినిమా ద్వారా పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఈ సినిమా చూసినవారు నరసింహ స్వామికి అలాగే శ్రీ మహా విష్ణువుకి భక్తులు అవుతారు అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. తాజాగా విడుదలైన ఈ సినిమాకు… ప్రేక్షకులు భక్తులు ఆలయాలకు పోటెత్తినట్లుగా థియేటర్లకు వెళ్తున్నారు.
Also Read : బీసీ రిజర్వేషన్ల బిల్లుల అమలుకు ఢిల్లీలో ఆందోళన, సీఎం రేవంత్‌తో మీనాక్షి భేటీ