క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: జాతిపిత మహాత్మా గాంధీ దేశం కోసం చేసిన త్యాగానికి గుర్తుగా అయన వర్ధంతిని ప్రతి సంవత్సరం జనవరి 30న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 1948 జనవరి 30న న్యూఢిల్లీలోని బిర్లా హౌస్‌లో ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా ఆయన నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు..
గాంధీజీ దేశం కోసం చేసిన త్యాగానికి గుర్తుగా ఈ రోజును భారతదేశం అంతటా “అమరవీరుల దినోత్సవం” గా పాటిస్తారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం ప్రతి ఏటా జనవరి 30న ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా రెండు నిమిషాల పాటు నిశ్శబ్దాన్ని పాటిస్తారు..
ఢిల్లీలోని గాంధీజీ సమాధి అయిన రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు ఇతర ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఈ రోజున గాంధీజీకి ఇష్టమైన భజనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు..





