
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ఎన్నో వివాదాలు తర్వాత ఎట్టకేలకు బాలకృష్ణ నటించిన అఖండ -2 సినిమాకు లైన్ క్లియర్ అయింది. అన్ని వివాదాలు సద్దుమణిగిన నేపథ్యంలో తాజాగా ఈ విషయాన్ని పరిశీలించిన మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 12వ తేదీన సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ఇప్పటికే సన్నాహాలు కూడా పూర్తి చేసుకున్నారు. దీంతో ఏ క్షణమైనా కూడా ఈ సినిమా విడుదల తేదీ పై ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.
Read also : Facts: ఈ గ్రామంలో గబ్బిలాలను దైవంలా పూజిస్తారట! ఎక్కడో తెలుసా?
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్స్ మరియు టికెట్ రేట్లు పెంచుకోవడంపై నిర్మాణ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదిస్తున్నట్లుగా సమాచారం. మొదటగా ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల ద్వారా వాయిదా పడిన విషయం తెలిసిందే. అఖండ-2 సినిమాకు సంబంధించి వివాదం పూర్తి కావడంతో ఇవాళ మద్రాస్ కోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. దీంతో ఈ సినిమా ఏ రోజు విడుదల చేస్తారు అనేది ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మూవీ మేకర్స్ ఈ నెల 12వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్న హాలు చేస్తుండగా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
Read also : సోనియాగాంధీకి నోటీసులు ఇచ్చిన రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు





