
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ :-జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం, మద్దులపల్లి సర్పంచిగా నూతనంగా ఎన్నికైన ఎల్పుల సరిత వార్డు సభ్యులతో కలిసి హైదరాబాదులో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. మంత్రి శ్రీధర్ బాబు సర్పంచి సరిత, ఉప సర్పంచ్ లచ్చిరెడ్డి, యువకులు మహి, సురేష్, విజయ్, సడవలికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చకినారపు సంతోష్, చకినారపు తేజస్విని, పూతల శ్రావణి, పిప్పిరెడ్డి లచ్చిరెడ్డి (ఉపసర్పంచ్), పూతల దేవిక, పూతల వెంకటేష్, కోరాళ్ళ మనక్క, చాకినరపు శ్రీజ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు బన్సోడ రామారావు, నాయకులు సురేందర్, సమ్మయ్య, దుర్గయ్య, రాకేష్, రవి మరియూ తదితరులు పాల్గొన్నారు.
Read also : 2038 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది : సీఎం చంద్రబాబు
Read also : సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన హరీష్ రావు?





