
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రస్తుతం టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు. ఆ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో.. అల్లు అర్జున్ మార్కెట్ ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ చేసేటువంటి ప్రతి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా సినిమా ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇప్పటికే అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా ఎంపిక చేసుకోగా త్వరలోనే మరో స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజు తో కూడా సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం.
Read also : సర్పంచుల ఫోరం అధ్యక్షునికి శుభాకాంక్షలు : మాజీ సర్పంచ్
ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే లోకేష్ కనగరాజు కాంబినేషన్ లో మరో సినిమా ప్రారంభమవుతుంది అని టాలీవుడ్ లో విస్తృతస్థాయిలో టాక్ కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం తాజాగా లోకేష్ కనగరాజు హైదరాబాదు వచ్చి మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి ఈ సరికొత్త మూవీ పై చర్చించారట. దీంతో ఇద్దరు తమిళ స్టార్ డైరెక్టర్లతో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు మన తెలుగు డైరెక్టర్ త్రివిక్రమ్ తో నాలుగో చిత్రం కూడా చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మరియు లోకేష్ కనగరాజ్ తీసినటువంటి సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వగా మరి అల్లు అర్జున్ సినిమా కూడా ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ చేస్తారా?.. అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఈ సినిమాలు విడుదల కావడానికి కొన్ని నెలలపాటు సమయం పట్టవచ్చు.
Read also : ఉదయాన్నే దీనిని తాగితే మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది!





