
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు అలర్ట్. గత కొద్ది రోజుల నుంచి వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి అల్పపీడనం ముప్పు పొంచి ఉంది అని చెప్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండం గా బలపడుతుంది అని APSDMA ప్రకటించింది. ఈ వాయుగుండం ఈనెల 29 నాటికి తమిళనాడు మరియు దక్షిణ కోస్తా మధ్య తీరం దాటేటటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. దీని కారణంగా రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక నెల చివరాఖరిలోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయి అని పేర్కొన్నారు. ప్రస్తుతం సముద్రతీరంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి… కోతకు వచ్చిన పంటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. ఇప్పటికే ముంత తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలు కోలుకోలేని పరిస్థితిలో ఏర్పడ్డాయి. మళ్లీ ఇలాంటి అకాల వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని ప్రతి ఒక్కరు కూడా భయంతో ఉన్నారు.
Read also : Panchayat Elections: ఇవాళ్టి నుంచి మొదటి విడత నామినేషన్లు
Read also : Telangana excise: డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభం





