జాతీయంవైరల్

Love Marriage: అత్తను పెళ్లి చేసుకున్న యువకుడు!

Love Marriage: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ ప్రేమజంటకు పెళ్లి విషయంలో అడ్డంకులు ఎదురయ్యాయి.

Love Marriage: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ ప్రేమజంటకు పెళ్లి విషయంలో అడ్డంకులు ఎదురయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. సంజన, కృష్ణ కుమార్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఓ ఆలయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే సంజన, కృష్ణకి అత్త వరుస అవుతుందన్న కారణంతో కుటుంబసభ్యులు ఈ పెళ్లికి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.

దీంతో విషయం పోలీసుల వరకు వెళ్లగా, ఇద్దరి మాటలు విన్న అధికారులు పెద్దలకు నచ్చజెప్పారు. చివరికి గ్రామ పెద్దలు, కుటుంబసభ్యులు సమక్షంలోనే పోలీసుల ఆధ్వర్యంలో ఈ జంటకి వివాహం జరిపించారు. జన్మించిన సంబంధాలు అడ్డొచ్చినా.. ప్రేమ చివరకు గెలిచిన ఘటనగా ఇది నిలిచింది.

ALSO READ: FLASH: భారత్ పర్యటనలో పుతిన్ అరెస్ట్..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button